ధోనీ న్యూ లుక్: ఫ్యాన్స్‌ ఏమన్నారంటే.. | MS Dhoni New Look Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన ధోనీ న్యూ లుక్‌!

May 9 2020 5:16 PM | Updated on May 9 2020 5:53 PM

MS Dhoni New Look Viral On Social Media - Sakshi

తెల్లగడ్డంతో ఉన్న ధోనీ

ముంబై : కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకు పరిమితమైన ప్రముఖులంతా కొత్తకొత్త అవతారాలతో దర్శనిమిస్తున్నారు. సౌత్‌, నార్త్‌ అని తేడా లేకుండా సెలబ్రెటీల న్యూ లుక్స్‌ నెట్టింట చక్కర్లు కొట్టటం పరిపాటిగా మారింది. తాజాగా  భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనీ న్యూలుక్‌ టాక్‌ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ధోనీ నల్లని జుట్టు.. నెరిసిన గడ్డంతో ఉన్న ఓ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ధోనీ కూతురు జీవా సింగ్‌ ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఈ వీడియో పోస్టైంది. ఆ వీడియోలో సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌లో ఉన్న ధోనీ, జీవాతో కలిసి ఆడుకుంటున్నారు. ( వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..! )

ధోనీ న్యూలుక్‌పై స్పందిస్తున్న ఫ్యాన్స్‌ ‘‘ వావ్‌! ధోనీ సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ బాగుంది.. క్వారెంటైన్‌ లుక్‌..  గత పదేళ్లుగా మొత్తం శ్రమను, నిందలను మోస్తున్న వ్యక్తి ఇంకెలా ఉంటాడు చెప్పండి.. ధోనీ చాలా ముసలోడిలా కనిపిస్తున్నారు ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( 'పాంటింగ్‌ గెలుపు కోసం చూస్తాడు.. ధోని మాత్రం' )

Advertisement
 
Advertisement
Advertisement