వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..! | David Warner Grooves To Tamil Song In Hilarious TikTok Video | Sakshi
Sakshi News home page

వార్నర్‌ కుమ్మేస్తున్నాడుగా..!

May 9 2020 2:55 PM | Updated on May 9 2020 3:24 PM

David Warner Grooves To Tamil Song In Hilarious TikTok Video - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వీరబాదుడుకు మారుపేరు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ అయిన వార్నర్‌ మోతకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. అదే జోష్‌ను టిక్‌టాక్‌లో కనబరుస్తున్నాడు వార్నర్‌. ఇటీవల టిక్‌టాక్‌లో అరంగేట్రం చేసిన వార్నర్‌.. వరుస వీడియోలతో ఫ్యాన్స్‌కు మంచి మజాను అందిస్తున్నాడు. ఒకవైపు టిక్‌టాక్‌ వీడియోలను ఆస్వాదిస్తూనే, మరొకవైపు తెలుగు, తమిళ పాటలకు తన డ్యాన్స్‌ రిథమ్‌ కలపడం విశేషం. మొన్న అలవైకుంఠపురం సినిమాలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు ఇరగదీసిన వార్నర్‌.. తాజాగా తమిళ సాంగ్‌ సన్నజాజికి డ్యాన్స్‌ చేశాడు. తన భార్య క్యాండీస్‌తో కలిసి తమిళసాంగ్‌కు టిక్‌టాక్‌ చేశాడు. ముందు వరుసలో కూతురు ఉండగా, వెనకాల వార్నర్‌-కాండీస్‌లు జంటగా కాలు కదిపారు. ఇది నిమిషాల్లో వైరల్‌ కావడం​తో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. (ధావన్‌ ఒక ఇడియట్‌.. స్ట్రైక్‌ తీసుకోనన్నాడు..!)

ప్రధానంగా సౌత్‌ ఇండియా సినిమాల్లోని పాటలకు వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలు చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇంకొన్ని వీడియోలు చేయాలంటూ వార్నర్‌ను కోరుతున్నారు. ‘వార్నర్‌.. నీ డ్యాన్స్‌తో మరొక స్టేజ్‌ను చూస్తున్నావు.. మాకు అంతే వినోదాన్ని అందిస్తున్నావు’ అని ఒక అభిమాని రిప్లై ఇవ్వగా, ‘వావ్‌.. థట్స్‌ అమేజింగ్‌ మేట్‌’ అంటూ మరొక అభిమానిపేర్కొన్నాడు. ‘ ఈ కరోనా సంక్షోభంలో ఒకే ఒక్క క్రికెటర్‌ నాకు కావాల్సిన వినోదాన్ని ఇస్తున్నాడు’ అని వార్నర్‌ను కొనియాడాడు.  కొన్నిరోజుల క్రితం వార్నర్‌.. భార్య క్యాండీస్‌తో కలిసి బుట్టబొమ్మ తెలుగు సాంగ్‌కు స్టెప్పులేశాడు.  తన భార్య తో కలిసి బుట్టబొమ్మ స్టెప్పుల్ని అనుకరిస్తూ డాన్స్‌ చేశాడు. వీడియోలో వార్నర్, క్యాండీస్‌ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది. అందుకే ఆ పాటలాగే వీరి డాన్స్‌ అదిరిపోయింది. ఆపై మరో ఫన్నీ వీడియోను షేర్‌ చేశాడు. సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు భువనేశ్వర్‌ కుమార్‌, కేన్‌ విలియమ్సన్‌లతో కలిసి గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా షూట్‌ చేసిన వీడియోను వార్నర్‌ పోస్ట్‌ చేశాడు. ఇప్పుడు మరొక సాంగ్‌కు చేసిన టిక్‌టాక్‌ వీడియో అటు క్లాస్‌, ఇటు మాస్‌ అభిమానులకి పసందుగా మారింది. (బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement