బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య | David Warner Couple Dance For Telugu Song Buttabomma | Sakshi
Sakshi News home page

బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య

Apr 30 2020 1:34 PM | Updated on Apr 30 2020 1:42 PM

David Warner Couple Dance For Telugu Song Buttabomma - Sakshi

కరోనా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా క్రికెటర్‌ డెవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్లో భార్య క్యాండిస్‌తో కలిసి టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆయన తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రంలోని సూపర్‌ హిట్‌‌ బుట్ట బొమ్మ సాంగ్‌కు క్యాండిస్‌తో కలిసి వార్నర్‌ చిందేశారు. ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో.. వార్నర్‌ సన్‌రైజర్స్‌ టీ షర్ట్‌ ధరించారు. వార్నర్‌ దంపతులు డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో వారి కుమార్తె ఇండి కూడా వెనకాల తిరుగుతూ తనకు తోచిన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను వార్నర్‌ దంపతులు వారి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లలో పోస్ట్‌ చేశారు. 

ఈ వీడియోను పోస్ట్‌ చేసిన క్యాండిస్‌.. ‘ఇండి మొత్తం షోను దొంగిలించిందని’ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, ఐపీఎల్‌ సీజన్‌ అప్పుడు ఎక్కువ సమయం హైదరాబాద్‌లో గడుతున్న వార్నర్‌.. తెలుగు వాతావరణానికి బాగా అలవాటు పడ్డారు. అందులో భాగంగానే తెలుగు అభిమానుల అలరించడం కోసం బుట్టబొమ్మ సాంగ్‌కు చిందేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు బుట్టబొమ్మ సాంగ్‌ కూడా ఇటీవల కాలంలో బాగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. చాలా మంది ఈ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement