
లండన్: ‘మీ అభిప్రాయం ప్రకారం పుల్ షాట్ ఆడే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ ఎవరు?’అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ ఐసీసీ ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోలో వివియన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్, హెర్షల్ గిబ్స్‌లతో పాటు టీమిండియా సారథి విరాట్ కోహ్లిలు ఉన్నారు. అయితే ఐసీసీ పోస్ట్‌కు స్పందించిన రోహిత్ ‘ఇక్కడ ఎవరు మిస్సయ్యారు? నా గెస్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ అంత సులభం కాదు’అంటూ రీట్వీట్ చేశాడు. ఇక మైకేల్ వాన్ మాత్రం తమ ఇంగ్లిష్ క్రికెటర్లలో బెన్ స్టోక్స్, జో రూట్, జోనీ బెయిర్ స్టో, జాస్ బట్లర్‌ల పక్కన పెట్టి మరీ ఐసీసీ ట్వీట్‌పై వ్యంగ్యంగా రిప్లై ఇచ్చాడు. (ఐసీసీ పోస్ట్‌పై రోహిత్ శర్మ అసంతృప్తి)
ఈ క్రమంలోనే వాన్ ఒక కొత్త పేరును ప్రస్తావించాడు. ఇంగ్లండ్‌కే చెందిన జాక్ లీచ్.. అత్యుత్తమ పుల్‌షాట్ కొట్టే ఆటగాడని బదులిచ్చాడు. ఇది కొంత ఆశ్చర్యాన్ని గురి చేసినా అభిమానులకు మాత్రం నవ్వులు తెప్పించింది. ఐసీసీకి సరిగానే సమాధానం ఇచ్చాడని అనుకోవడం పలువురు అభిమానుల వంతైంది. ఎందుకంటే జాక్ లీచ్ ప్రొఫెషనల్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ కాదు.. అతను స్పిన్నర్. ఇలా ఐసీసీకి వాన్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడానికి ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ పుల్‌షాట్లు ఆడే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే వాన్ బదులిచ్చాడనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది.