‘టోక్యో’లో ఫైనల్‌ చేరే సత్తా మాకుంది: మన్‌ప్రీత్‌ | Manpreet Speaks About Tokyo Olympics Final | Sakshi
Sakshi News home page

‘టోక్యో’లో ఫైనల్‌ చేరే సత్తా మాకుంది: మన్‌ప్రీత్‌

Jan 2 2020 1:39 AM | Updated on Jan 2 2020 1:39 AM

Manpreet Speaks About Tokyo Olympics Final - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరే సత్తా భారత పురుషుల హాకీ జట్టుకు ఉందని సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇందుకోసం భారత జట్టు క్రమశిక్షణ, నిలకడ ప్రదర్శించాలని ఆయన పేర్కొన్నాడు. ‘2019 సంవత్సరాన్ని విశ్లేషిస్తే... భారత జట్టుకు గొప్పగా గడిచింది. మేము గత ఏడాదిని 5వ ర్యాంకుతో ఆరంభించి అదే ర్యాంకుతో ముగించాం. మేము జట్టుగా సాధించిన అతి పెద్ద విజయం ఏదైనా ఉందంటే అది ఒలింపిక్స్‌కు అర్హత సాధించటమే. ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం... ఒలింపిక్స్‌లో ఫైనల్‌ చేరటమే... నమ్మండి అది సాధించగల లక్ష్యమే...’ అంటూ మన్‌ప్రీత్‌ పేర్కొన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement