‘రియో’కు చేరువలో మనోజ్, సుమిత్ | Manoj Kumar, Sumit Sangwan inch closer to Rio 2016 Olympics berth | Sakshi
Sakshi News home page

‘రియో’కు చేరువలో మనోజ్, సుమిత్

Jun 22 2016 12:33 AM | Updated on Sep 4 2017 3:02 AM

మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

బాకు (అజర్‌బైజాన్): మరో విజయం సాధిస్తే భారత బాక్సర్లు మనోజ్ కుమార్ (64 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (81 కేజీలు) రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మనోజ్ 2-1తో ఇస్మెతోవ్ ఐరిన్ స్మెతోవ్ (బల్గేరియా)ను ఓడించగా... సుమిత్ 3-0తో సందాగ్‌సురెన్ ఎర్దెనెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించాడు.

75 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన వికాస్ కృషన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరుకున్నాడు. 49 కేజీల విభాగంలో దేవేంద్రో సింగ్ సెమీఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌కు చేరితేనే దేవేంద్రోకు రియో బెర్త్ ఖాయమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement