
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించిన జైస్మిన్ లంబోరియా ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. హరియాణాకు చెందిన జైస్మిన్ కుటుంబాన్ని ‘బాక్సర్‌ల కుటుంబం’ అంటుంటారు. ఆమె తాత కెప్టెన్ చందర్ బ్యాన్ లంబోరియా రెజ్లర్. బాబాయ్‌లు నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్స్‌గా సత్తా చాటారు. తాతల బాక్సింగ్ నైపుణ్యాల గురించి వింటూ, బాబాయ్‌ల బాక్సింగ్‌ల ప్రతిభను చూస్తూ పెరిగింది జైస్మిన్.
వారి స్ఫూర్తితో బాక్సింగ్‌లోకి అడుగు పెట్టిన జైస్మిన్ తన 4ఎత్తు కారణంగా మొదట్లో ఇబ్బంది పడింది. అపజయాలు పలకరించాయి. ‘అపజయాన్ని చూసి బాధపడడం కంటే ఆడేవి«ధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది’ అని ధైర్యం చెప్పుకొని తన స్టైల్‌ను మార్చుకుంది. ఆ మార్పులలో అతిగా తొందరపడకుండా ఓపికగా ఉండడం కూడా ఒకటి. కొత్త స్టైల్‌తో బంగారు పతకం గెలుచుకుంది. బ్రెజిల్‌లో జరిగిన ‘వరల్డ్ బాక్సింగ్ కప్’కు జైస్మిన్‌ను పంపడానికి నిరాకరించిన బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సైతం స్వర్ణపతకం గెలిచిన సందర్భంగా ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా’ అంటూ ‘ఎక్స్’ వేదికగా ఎక్సలెంట్ టెక్నికల్ బాక్సర్ జైస్మిన్ లంబోరియాను ప్రశంసించడం విశేషం.