భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్‌.. ఫైనల్లో మీనాక్షి అదుర్స్‌ | Minakshi Hooda clinches gold at World Boxing Championships | Sakshi
Sakshi News home page

World Boxing Championships: భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్‌.. ఫైనల్లో మీనాక్షి అదుర్స్‌

Sep 14 2025 6:03 PM | Updated on Sep 14 2025 6:16 PM

Minakshi Hooda clinches gold at World Boxing Championships

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌- 2025లో భార‌త్ ఖాతాలో మ‌రో స్వ‌ర్ణ ప‌త‌కం చేరింది. మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా బంగారు ప‌తకం చేసుకుంది. ఆదివారం జ‌రిగ‌న ఫైన‌ల్ పోరులో క‌జ‌కిస్తాన్‌కు చెందిన నాజిమ్ కైజైబేను 4-1 స్ప్లిట్ డెసిషన్‌తో మీనాక్షి ఓడించింది.  

ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన నాజిమ్ నుంచి భారత బాక్సర్‌కు గట్టి పోటీ ఎదరైంది. ప్రత్యర్ధిపై తన పంచ్‌లతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మీనాక్షి.. తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాజిమ్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. 

దీంతో రెండో రౌండ్‌లో  మీనాక్షిపై నాజీమ్ 3-2తో విజయం సాధించింది. మూడో రౌండ్‌లో ఈ ఇద్ద‌రూ బాక్స‌ర్లు హోరాహోరీగా త‌ల‌ప‌డ్డారు. నిర్ణీత స‌మ‌యంలో ఎవ‌రూ పాయింట్లు సాధించ‌క‌పోవ‌డంతో నలుగురు న్యాయమూర్తులు మీనాక్షికి  అనుకూలంగా ఓటు వేశారు. దీంతో 4-1 తేడాతో మీనాక్షి స్వ‌ర్ణం సొంతం చేసుకుంది. ఇదే టోర్నమెంట్‌లో భారత బాక్సర్  లంబోరియా 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement