విజేతలు మనోహర్‌ కుమార్, నటరాజ్‌ శర్మ | Manohar And Nataraj Got Table Tennis Titles | Sakshi
Sakshi News home page

విజేతలు మనోహర్‌ కుమార్, నటరాజ్‌ శర్మ

Oct 22 2019 11:11 AM | Updated on Oct 22 2019 11:11 AM

Manohar And Nataraj Got Table Tennis Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెటరన్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌లో బి. మనోహర్‌ కుమార్‌ చాంపియన్‌గా నిలిచాడు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో 40 ప్లస్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో మనోహర్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మనోహర్‌ కుమార్‌ 11–13, 11–2, 11–4, 11–8తో రామారావుపై గెలుపొందాడు. 50 ప్లస్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో పి. సురేశ్‌ 11–7, 10–12, 11–4, 7–11, 11–9తో ఎంవీఎన్‌ కిశోర్‌ కుమార్‌ను ఓడించి విజేతగా నిలిచాడు.

60–64 వయో విభాగంలో నటరాజ్‌ శర్మ 14–12, 11–6, 11–3తో ఉపేంద్రనాథ్‌పై గెలుపొందాడు. 65 ప్లస్‌ పురుషుల ఫైనల్లో జీవీ రంగారావు 11–1, 11–3, 11–5తో కేఆర్‌ శ్రీనివాస రావుపై గెలుపొందగా.. 70 ప్లస్‌ పురుషుల టైటిల్‌పోరులో సి. శ్రీనివాస్‌ 12–10, 11–2, 12–8తో రమణ ప్రసాద్‌ను ఓడించాడు.   

Advertisement
 
Advertisement
Advertisement