ధోనీ సంచలన నిర్ణయం | Mahendra Singh Dhoni quits as India captain | Sakshi
Sakshi News home page

ధోనీ సంచలన నిర్ణయం

Jan 4 2017 9:25 PM | Updated on Sep 5 2017 12:24 AM

వన్డేలు, టీ20ల కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోనీ గుడ్బై చెప్పారు.

న్యూఢిల్లీ:
వన్డేలు, టీ20ల కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోనీ గుడ్బై చెప్పాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు బీసీసీఐకు ధోనీ సమాచారం ఇచ్చారు. ధోని నిర్ణయాన్ని బీసీసీఐ ట్విట్టర్లో ప్రకటించింది.

ఇంగ్లండ్తో వన్డేలు, టీ20 మ్యాచ్లకు ధోనీ అందుబాటులో ఉండనున్నాడు. ఇప్పటి వరకు 199 వన్డేలు, 72 టీ20 మ్యాచ్లకు ధోనీ కెప్టెన్గా వ్యవహరించాడు. ఇంగ్లండ్తో సిరీస్కు విరాట్ కోహ్లీ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.

2007 నుంచి 2016 వరకు వన్డేలు, టీ20 లకు కెప్టెన్గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించాడు. ధోని కెప్టెన్సీలో వన్డేల్లో 110 విజయాలతో 59.57 శాతం సక్సెస్ రేట్తో భారత్ దూసుకుపోయింది. పాంటింగ్ తర్వాత అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్గా ధోనీ రికార్డు సృష్టించాడు. 72 టీ-20 మ్యాచ్లలో 41 విజయాలతో, 59.28 శాతం సక్సెస్ రేట్తో తిరుగులేని కెప్టెన్గా నిలిచాడు. టీ-20 మ్యాచ్ల్లో అత్యధిక విజయాలను అందించిన కెప్టెన్గా ధోనీ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలోనే 2007లో టీ-20, 2011లో వన్డే ప్రపంచకప్ను భారత్ కైవసం చేసుకుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement