రెండో టి20లో దక్షిణాఫ్రికాపై లంక గెలుపు | Limping Angelo Mathews seals first Sri Lanka win on tour | Sakshi
Sakshi News home page

రెండో టి20లో దక్షిణాఫ్రికాపై లంక గెలుపు

Jan 23 2017 12:37 AM | Updated on Nov 9 2018 6:35 PM

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంకేయులు సమష్టిగా రాణించారు.

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో శ్రీలంక 3 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో లంకేయులు సమష్టిగా రాణించారు. ముందుగా బౌలింగ్‌లో లక్షణ్‌ శాందకన్‌ (4/23), ఇసురు ఉదన (3/13) సఫారీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా 19.3 ఓవర్లలో 113 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత శ్రీలంక 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ మాథ్యూస్‌ (54 నాటౌట్‌; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కడదాకా క్రీజ్‌లో నిలిచి గెలిపించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. చివరి టి20 మ్యాచ్‌ ఈనెల 25న కేప్‌టౌన్‌లో జరుగనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement