‘అక్తర్‌ నన్ను చంపుతానన్నాడు’

Liam Plunkett Recalls Frightening Encounter With Shoaib Akhtar - Sakshi

లండన్‌:   తాను అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రానికి ముందే పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చంపుతానంటూ బెదిరించాడని ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ లియామ్‌​ ప్లంకెట్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. 2005లో అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం పాకిస్తాన్‌తో లాహోర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అరంగేట్రం చేసిన తనకు తొలి మ్యాచ్‌కు ముందే చేదు అనుభవాలు ఎదురయ్యాయని ప్లంకెట్‌ చెప్పుకొచ్చాడు. తాను రనప్‌ చేస్తున్న సమయంలో ఒక నవ్వి నవ్విన అక్తర్‌.. చంపుతానంటూ వార్నింగ్‌ ఇచ్చాడన్నాడు. ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని ప్లంకెట్‌ తెలిపాడు. ఎందుకంటే తామిద్దరం కలిసి కౌంటీ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉన్న క్రమంలో ఇలా బెదిరించడం అంతుబట్టలేదన్నాడు. ‘ కౌంటీ క్రికెట్‌లో అక్తర్‌ కోసం లెగ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తే, స్టీవ్‌ హార్మిసన్‌ కోసం స్లిప్‌లో ఉండేవాడిని. కానీ టెస్టు మ్యాచ్‌లో అక్తర్‌తో తలపడటం అదే తొలిసారి. ఆ మ్యాచ్‌ కోసం నేను రనప్‌ చేస్తున్నా. (‘నేను కారు ప్రమాదంలో చనిపోలేదు’)

అప్పుడు అక్కడికి వచ్చిన అక్తర్‌ నన్ను చూసి నవ్వాడు. వెంటనే నిన్ను చంపేస్తా అంటూ గట్టిగా అరిచాడు. నన్ను భయభ్రాంతులకు గురి చేసే యత్నం చేశాడు. మ్యాచ్‌ ఆరంభమైన తర్వాత రెండో రోజు ఆటకు సిద్ధమయ్యా. నాకు తొలిరోజు ఆటలానే అనిపించింది. నేను బ్యాట్‌ పట్టుకుని కూర్చొని ఉ‍న్నా. తర్వాత నాదే బ్యాటింగ్‌. గంటకు 96,97 మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్నాడు. టీవీ స్క్రీన్లలో నాకు కనబడుతుంది. అక్తర్‌ అన్న మాటలు నాకు గుర్తొచ్చాయి. ఆష్లే గైల్స్‌ వికెట్‌ను అక్తర్‌ తీయడంతో నేను బ్యాటింగ్‌ వెళ్లాను. ఆ 90 మైళ్ల వేగంతో బౌలింగ్‌ చేసే అక్తర్‌ను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డా. నేను ఆడిన తొలి బంతినే సమర్థవంతంగా ఆడా. కానీ ఒక బంతి నా భుజాన్ని తాకింది.  కానీ నేను భయపడలేదు. చెట్టు మొదళ్లు వలే క్రీజ్‌లో పాతుకుపోవడానికి సిద్ధమయ్యా. అదే ధైర్యంతో 51 బంతులు ఆడి 9 పరుగులు చేశా. నా బాధ్యతను నేను నిర్వర్తించానని అనుకున్నా. దాదాపు 10 ఓవర్లు క్రీజ్‌లో ఉండి అక్తర్‌కు పరీక్షగా నిలిచా. నేను చివరికు మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యా. నా వికెట్‌ అక్తర్‌కు లభించకపోయినా నన్ను స్లెడ్జ్‌ చేసే క‍్రమంలో ఏదో మ్యూజిక్‌ చేశాడు’ అని ప్లంకెట్‌ తెలిపాడు. (‘ద్రవిడ్‌ కెప్టెన్సీకి క్రెడిట్‌ దక్కలేదు’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top