లలిత్‌కు ఆరో స్థానం | Lalit to sixth palce | Sakshi
Sakshi News home page

లలిత్‌కు ఆరో స్థానం

Jan 17 2017 12:07 AM | Updated on Sep 5 2017 1:21 AM

పార్శ్వనాథ్‌ ఢిల్లీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు 7.5 పాయింట్లు సాధించి ఆరో

న్యూఢిల్లీ: పార్శ్వనాథ్‌ ఢిల్లీ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎం.ఆర్‌.లలిత్‌ బాబు 7.5 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచాడు. పది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో తజకిస్తాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఫారూఖ్‌ అమోనతోవ్‌ 8.5 పాయింట్లతో విజేతగా నిలిచాడు. 8 పాయింట్లతో దీప్తాయన్‌ ఘోష్‌ (భారత్‌), జుమయెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. కేటగిరీ ‘సి’లో హైదరాబాద్‌ ప్లేయర్‌ షణ్ముఖ తేజ 8.5 పాయింట్లతో 8వ స్థానాన్ని పొందాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement