జైపూర్ జోరుకు బ్రేక్ | Jaipur pace to break | Sakshi
Sakshi News home page

జైపూర్ జోరుకు బ్రేక్

Jul 15 2016 1:51 AM | Updated on Sep 4 2017 4:51 AM

జైపూర్ జోరుకు బ్రేక్

జైపూర్ జోరుకు బ్రేక్

ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది.

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్న జైపూర్ పింక్ పాంథర్స్‌కు ఝలక్ తగిలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 29-23తో జైపూర్‌పై నెగ్గింది. సురేశ్ కుమార్ (6), కెప్టెన్ అనూప్ కుమార్ (5)ల సూపర్ రైడింగ్‌తో యు ముంబా ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని ప్రదర్శించింది.


జైపూర్ నుంచి రాజేశ్, జస్వీర్ ఆరేసి రైడింగ్ పాయింట్లతో చెలరేగినా ఇతరుల నుంచి సహకారం కరువైంది. తొలి అర్ధభాగం వరకు 10-8తో జైపూర్ ఆధిక్యంలోనే ఉంది. అయితే ఆ తర్వాత మాత్రం ముంబా ఆటగాళ్ల ధాటికి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38-23తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement