టీమిండియా ‘అతి పెద్ద’ రికార్డుకు బ్రేక్‌

India's Long Reign As Test Topper Came To An End - Sakshi

42 నెలలు తర్వాత టాప్‌ కోల్పోయిన టీమిండియా

మళ్లీ అగ్రస్థానానికి చేరిన ఆసీస్‌

న్యూఢిల్లీ: టెస్టు ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘ కాలం పాటు నంబర్‌ వన్‌గా కొనసాగిన టీమిండియా అతి పెద్ద రికార్డుకు బ్రేక్‌ పడింది.  42 నెలలు పాటు అగ్రస్థానంలో కొనసాగిన టీమిండియా.. ఆ ర్యాంక్‌ను  కోల్పోయింది. 2016 అక్టోబర్‌లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఇప్పటివరకూ ఆ స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. 2016-17 సీజన్‌లో 12 టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. కేవలం ఒక టెస్టులో మాత్రమే ఓటమి పాలైంది. ఫలితంగా ఆ సీజన్‌లో  టాప్‌ ర్యాంకును కైవసం చేసుకుంది. ఆ ర్యాంకును ఇప్పటివరకూ కాపాడుకుంటూ వచ్చిన భారత జట్టు తొలిసారి దాన్ని చేజార్చుకుంది. (గేల్‌.. ఇక నీ కామెంట్స్‌ చాలు..!)

మూడు సంవత్సరాల ఆరు నెలల పాటు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా..  కొన్ని నెలల క్రితం మూడో స్థానంలో  ఉన్న ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టింది. ఇంగ్లండ్‌(1970-73 సీజన్‌లో) 37 నెలలు పాటు టాప్‌లో ఉంది.  ఇంగ్లండ్‌ రికార్డును బ్రేక్‌ చేసి మరో ఐదు నెలలు పాటు మాత్రమే టాప్‌లో ఉన్న టీమిండియా.. ఆ ర్యాంక్‌ను మళ్లీ ఆసీస్‌కు అప్పగించింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) అప్‌డేట్‌ చేసిన టెస్టు  ర్యాంకింగ్స్‌ ప్రకారం ఆసీస్‌ టాప్‌కు ఎగబాకింది. ఆస్ట్రేలియా 116 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, న్యూజిలాండ్‌ 115 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక టీమిండియా టీమిండియా 114 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. 

 కాగా, టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం నంబర్‌ వన్‌ స్థానాన్ని నిలబెట్టుకున్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ తర్వాత స్థానాన్ని టీమిండియా ఆక్రమించింది. ఆస్ట్రేలియా (2001-2009) 95 నెలల పాటు అగ్రస్థానంలో నిలవగా,  వెస్టిండీస్‌ (1981-1988)89 నెలల పాటు టాప్‌లో కొనసాగింది. ఆ తర్వాత ఈ రెండు జట్లు పలు పర్యాయాలు సుదీర్ఘ కాలం పాటు టాప్‌లో కొనసాగాయి. ఈ రెండు జట్లు తర్వాత ఎక్కువ కాలం టెస్టుల్లో టాప్‌లో కొనసాగిన జట్టు టీమిండియానే. (అతనొక మూర్చ రోగి: పీసీబీ మాజీ చైర్మన్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top