న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన | Indian team arrives in New Zealand for ODI series | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన

Jan 13 2014 1:23 PM | Updated on Sep 2 2017 2:36 AM

న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన

న్యూజిలాండ్ చేరుకున్న ధోని సేన

భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టులను ఆడేందుకు ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది.

నేపియర్: భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ చేరుకుంది. ఐదు వన్డేల సిరీస్‌తో పాటు రెండు టెస్టులను ఆడేందుకు ధోని నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇక్కడికి చేరుకుంది. ఆహ్లాదక వాతావరణం, ఉల్లాపరిచే పరిసరాలు నేపియర్ తమకు స్వాగతం పలికిందని ఇక్కడికి చేరుకున్న తర్వాత విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. మైదానంలో దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నామని పేర్కొన్నాడు. టీమిండియా సభ్యులు ముంబై నుంచి ఆక్లాండ్ చేరుకుని అక్కడి నుంచి నాపియర్కు వచ్చారు.
 
ఈనెల 19 నుంచి 31 వరకు జరిగే వన్డే సిరీస్‌లో నేపియర్, వెల్లింగ్టన్, హామిల్టన్, ఆక్లాండ్ వేదికల్లో మ్యాచ్‌లు  జరుగుతాయి. వచ్చే నెల 6 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. దీనికి ముందు రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఉంటుంది. అయితే బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా, మురళీ విజయ్, పేస్ బౌలర్లు  జహీర్ ఖాన్, ఉమేశ్ యాదవ్ మరో వారం తర్వాత కివీస్‌కు వెళ్లనున్నారు. 2008-09 అనంతరం భారత జట్టు తొలిసారిగా న్యూజిలాండ్ పర్యటనకు వెళుతుండగా ఓవరాల్‌గా ఇది తొమ్మిదోసారి.

Advertisement
 
Advertisement
Advertisement