కామన్వెల్త్‌ గేమ్స్‌ : బ్యాడ్మింటన్‌లో భారత్‌ జోరు | Indian badminton juggernaut continues at CWG | Sakshi
Sakshi News home page

కామన్వెల్త్‌ గేమ్స్‌ : బ్యాడ్మింటన్‌లో భారత్‌ జోరు

Apr 13 2018 7:37 PM | Updated on Apr 13 2018 7:41 PM

Indian badminton juggernaut continues at CWG - Sakshi

సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధు

గోల్డ్‌కోస్ట్‌:  కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల జోరు కొనసాగుతోంది. భారత స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు తమ తమ వ్యక్తిగత మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా నెహ్వాల్‌ 21-8, 21-13 తేడాతో రచెల్‌ హండ్రిచ్‌(కెనడా)పై వరుస గేమ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరగా, ఆపై పీవీ సింధు 21-14, 21-7 తేడాతో మరో కెనడా క్రీడాకారిణి బిట్నీ టామ్‌పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. ఇక పురుషుల సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ శ్రీకాంత్‌ 21-15 21-12 తో ర్యాన్‌ ఎంగ్‌ జిన్‌ రేయ్‌(సింగపూర్‌)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు.

మరొకవైపు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. శ్రీలంక ఆటగాడు దినుకా కరుణరత్నాను వరుస గేమ్‌ల్లో ఓడించి సెమీస్‌కు చేరాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సాత్విక్‌- పొన్నప్ప ద్వయం సెమీస్‌కు చేరింది. సాత్విక్‌- పొన్నప్ప జోడి 2-0తో గో సూన్‌ హాట్‌- షెవాన్‌ జెమీపై గెలిచి సెమీస్‌కు చేరగా, మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జోడి క్వార్టర్‌ అడ్డంకిని అధిగమించి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకున్నారు.  సిక్కిరెడ్డి-పొన్నప్ప అశ్విని జంట 2-0తో హాసిని-దిల్రుక్షి( శ్రీలంక) జంటపై గెలిచి సెమీస్‌కు చేరారు.

Advertisement
 
Advertisement
Advertisement