భారత్‌ x పాకిస్తాన్‌ | India x Pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌ x పాకిస్తాన్‌

Jul 5 2017 3:15 AM | Updated on Sep 5 2017 3:12 PM

ఇటీవలే క్రికెట్, హాకీ క్రీడాంశాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకున్న భారత్‌ స్నూకర్‌ ఈవెంట్‌లోనూ పోరుకు సిద్ధమైంది.

బిష్‌కెక్‌ (కిర్గిస్తాన్‌): ఇటీవలే క్రికెట్, హాకీ క్రీడాంశాల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకున్న భారత్‌ స్నూకర్‌ ఈవెంట్‌లోనూ పోరుకు సిద్ధమైంది. ఆసియా స్నూకర్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌ ‘ఎ’... పాకిస్తాన్‌ ‘బి’ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మంగళవారం జరిగిన సెమీఫైనల్స్‌లో పంకజ్‌ అద్వానీ, లక్ష్మణ్‌ రావత్‌లతో కూడిన భారత్‌ ‘ఎ’ జట్టు 3–0తో థాయ్‌లాండ్‌పై... పాకిస్తాన్‌ ‘బి’ 3–2తో పాకిస్తాన్‌ ‘ఎ’పై గెలుపొందాయి. నేడు ఫైనల్‌ జరుగుతుంది. ‘ఫైనల్‌ చేరే క్రమంలో మా ప్రదర్శనతో ఆకట్టుకున్నాం. పాక్‌తో ఫైనల్‌ పోరుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని పంకజ్‌ వ్యాఖ్యానించాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement