భారత్‌ జయకేతనం | india wins second T20 held in nagpur | Sakshi
Sakshi News home page

భారత్‌ జయకేతనం

Jan 29 2017 10:35 PM | Updated on Sep 5 2017 2:25 AM

భారత్‌ జయకేతనం

భారత్‌ జయకేతనం

భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20లో భారత్‌ గెలిచింది.

నాగపూర్: భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన రెండో టీ20లో భారత్‌ గెలిచింది.  చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కోహ్లసేన 5 పరుగుల తేడాతో విజయపతాకాన్ని ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ఇరవై ఓవర్లలో 144-8 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ జట్టు 139 పరుగులు చేసి ఓటమి పాలైంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1 తేడాతో సమమైంది. ఫిబ్రవరి 1న జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది.
 
ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 12 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా తన బౌలింగ్‌తో మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement