కోహ్లీ, ధావన్ హాఫ్ సెంచరీలు.. | India scores 134 in 27 overs | Sakshi
Sakshi News home page

కోహ్లీ, ధావన్ హాఫ్ సెంచరీలు..

Jan 17 2016 10:45 AM | Updated on Sep 3 2017 3:48 PM

ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది.

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. మాక్స్ వెల్ వేసిన భారత ఇన్నింగ్స్ 23వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసి కోహ్లీ, ఆరో బంతికి సింగిల్ తీసి శిఖర్ ధావన్ అర్ధ సెంచరీలు నమోదు చేశారు. 4 ఫోర్ల సాయంతో 51 బంతుల్లో కోహ్లీ, 6 ఫోర్ల సాయంతో 76 బంతుల్లో ధావన్ అర్ధ శతకాలు కొట్టారు. అంతకుముందు  టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

భారత స్కోరు 15 పరుగుల వద్ద గత రెండు మ్యాచ్ల్లో సెంచరీలతో జట్టును ఆదుకున్న రోహిత్ శర్మ 6 పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. అయితే, ధావన్(91 బంతుల్లో 68; 9 ఫోర్లు), కోహ్లీలు జట్టును ముందుకు నడిపించారు. జట్టు స్కోర్ 134 వద్ద రెండో వికెట్ రూపంలో ధావన్ వెనుదిరిగాడు.  ప్రస్తుతం కోహ్లీ(59 బంతుల్లో 55; 4 ఫోర్లు), రహానే(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో హాస్టింగ్స్, రిచర్డ్ సన్ చెరో వికెట్ పడగొట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement