
ఆ ఓటమిని పెద్దగా లెక్కచేయం: ధావన్
మంచి ఊపుమీదున్న టీమిండియా వార్మప్ మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాల్వడం పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని భారత క్రికెటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు.
మంచి ఊపుమీదున్న టీమిండియా వార్మప్ మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాల్వడం పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని భారత క్రికెటర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఆ ఓటమిని పెద్దగా లెక్కచేయాల్సిన అవసరం లేదని, నిజానికి ఈ వార్మప్ మ్యాచులోనూ భారత్ జట్టు చాలాబాగా ఆడిందని తెలిపాడు.
దక్షిణాఫ్రికా హిట్టర్స్ క్వింటన్ డి కాక్, జేపీ డుమ్నీ రెచ్చిపోయి అర్ధ సెంచరీలు బాదడంతో మొదట బ్యాటింగ్ చేసిన సఫారీలు 195 పరుగుల భారీ స్కోర్ సాధించారు. 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ సేన 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ వార్మప్ మ్యాచులో టీమిండియా ఓడిపోయినప్పటికీ, చక్కని ఆట ఆడామని, భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత జట్టు గొప్పగా ఆడిందని ధావన్ పేర్కొన్నాడు. అన్నిసార్లు ఫినిషర్లు ఫలితాన్ని రాబడతారని ఆశించకూడదని చెప్పాడు. అభిమానుల తమపై పెట్టుకున్న అంచనాల గురించి తెలుసనని, అయితే చేజింగ్‌లో 192 పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదని ఆయన అన్నాడు.