టీమిండియా ఓపెనర్లు అవుట్ | india lost two wickets at 16 runs | Sakshi
Sakshi News home page

టీమిండియా ఓపెనర్లు అవుట్

Mar 1 2016 9:11 PM | Updated on Nov 9 2018 6:43 PM

టీమిండియా ఓపెనర్లు అవుట్ - Sakshi

టీమిండియా ఓపెనర్లు అవుట్

ఆసియాకప్లో శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 పోరులో భారత్ 16 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.

మిర్పూర్:ఆసియాకప్లో శ్రీలంకతో జరుగుతున్న ట్వంటీ 20 పోరులో భారత్ 16 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్(1), రోహిత్ శర్మ(15)లు పెవిలియన్ చేరారు. ఈ రెండు వికెట్లను లంక బౌలర్ కులశేఖర తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేశారు.

 

శ్రీలంక ఆదిలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా కపుగదెరా(30), సిరివర్దనే(22)లు ఆదుకున్నారు. ఈ జోడీ ఐదో వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో శ్రీలంక  ఫర్వాలేదనిపించింది.  జట్టు స్కోరు ఆరు పరుగుల వద్ద చండిమాల్(4) తొలి వికెట్ గా పెవిలియన్కు చేరగా, 15 పరుగుల వద్ద జయసూరియా(3) రెండో వికెట్ గా అవుటయ్యాడు.అనంతరం దిల్షాన్(18), మాథ్యూస్(18)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో శ్రీలంక 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత  పెరీరా(17), కులశేఖర(12) సమయోచితంగా ఆడటంతో లంక తేరుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement