టీమిండియా తడ'బ్యాటు' | india lose 3 wickets and 43 runs | Sakshi
Sakshi News home page

టీమిండియా తడ'బ్యాటు'

Feb 24 2016 7:44 PM | Updated on Sep 3 2017 6:20 PM

టీమిండియా తడ'బ్యాటు'

టీమిండియా తడ'బ్యాటు'

ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది

మిర్పూర్: ఆసియాకప్ లో భాగంగా బుధవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో భారత్ తడబడుతూ బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఎనిమిది ఓవర్లలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. శిఖర్ ధావన్(2) తొలి వికెట్ గా పెవిలియన్ చేరగా, అనంతరం విరాట్ కోహ్లి(8) అవుటయ్యాడు.

 

అయితే క్రీజ్లో కుదరుగా బ్యాటింగ్ చేస్తున్నట్లు కనబడిన సురేష్ రైనా(13) కూడా నిరాశపరచడంతో టీమిండియా కష్టాల్లో పడింది.  బంగ్లాదేశ్ జట్టు అంచనాలను మించి రాణిస్తూ టీమిండియా ఆటగాళ్లను పరుగులు చేయకుండా నియంత్రిస్తున్నారు. బంగ్లా బౌలర్లలో ఆల్ అమీన్, మోర్తజా, మహ్మదుల్లాలు తలో వికెట్ తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement