రెండో వికెట్ కోల్పోయిన భారత్ | india lose 2nd wicket at 108 runs | Sakshi
Sakshi News home page

రెండో వికెట్ కోల్పోయిన భారత్

Mar 26 2017 1:22 PM | Updated on Sep 5 2017 7:09 AM

రెండో వికెట్ కోల్పోయిన భారత్

రెండో వికెట్ కోల్పోయిన భారత్

ఆస్ట్రేలియాతో్ ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ జట్టు రెండో వికెట్ ను కోల్పోయింది.

ధర్మశాల: ఆస్ట్రేలియాతో్ ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ జట్టు రెండో వికెట్ ను కోల్పోయింది. భారత్ ఓపెనర్ కేఎల్ రాహుల్(60;124 బంతుల్లో  9ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించిన తరువాత రెండో వికెట్ గా అవుటయ్యాడు.ఆసీస్ బౌలర్ కమిన్స్ వేసిన బంతిని ఆడటంలో విఫలమైన రాహుల్ క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు.

 

కమిన్స్ వేసిన బౌన్సర్ను హుక్ చేయబోయి వార్నర్ కు దొరికిపోయాడు. దాంతో 108 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ ను నష్టపోయింది.అంతకుముందు మురళీ విజయ్(11) తొలి వికెట్ గా అవుటయ్యాడు. హజల్ వుడ్ బౌలింగ్ లో కీపర్ వేడ్ కు క్యాచ్ ఇచ్చి విజయ్ పెవిలియన్ బాట పట్టాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement