తొలి ఓవర్లోనే రెండు వికెట్లు | india lose 2 wickets at first over | Sakshi
Sakshi News home page

తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

Feb 9 2016 7:38 PM | Updated on Nov 9 2018 6:43 PM

తొలి ఓవర్లోనే రెండు వికెట్లు - Sakshi

తొలి ఓవర్లోనే రెండు వికెట్లు

మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

పుణె: మూడు ట్వంటీ 20ల సిరీస్ లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలి ఓవర్ లోనే భారత్ రెండు ప్రధాన వికెట్లను నష్టపోయింది. శ్రీలంక బౌలర్ కాశున్ రజితా వేసిన రెండో బంతికి రోహిత్ శర్మ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, అనంతరం ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన అజింక్యా రహానే(4) అదే ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. దీంతో టీమిండియా ఐదు  పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ చేపట్టింది.

Advertisement
 
Advertisement
Advertisement