సిరీస్పై కన్నేసిన ధోని సేన | india look stay on twenty 20 series | Sakshi
Sakshi News home page

సిరీస్పై కన్నేసిన ధోని సేన

Jan 28 2016 4:21 PM | Updated on Sep 3 2017 4:29 PM

సిరీస్పై కన్నేసిన ధోని సేన

సిరీస్పై కన్నేసిన ధోని సేన

మూడు మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20లో గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.

మెల్బోర్న్: మూడు మ్యాచ్ లో సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ట్వంటీ20లో గెలిచిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. వన్డేల్లో ఎదురైన ఘోర పరాభావాన్ని వెనక్కి నెట్టాలంటే ట్వంటీ 20 సిరీస్ ను ముందుగా ముగించడమే టీమిండియా లక్ష్యంగా కనబడుతోంది. శుక్రవారం ఇరు జట్ల మధ్య రెండో ట్వంటీ 20 మ్యాచ్ జరుగనుంది. మెల్ బోర్న్ వేదికగా రేపు మధ్యాహ్నం గం.2.08ని.లకు(భారత కాలమాన ప్రకారం) మ్యాచ్ ఆరంభం కానుంది. త్వరలో భారత్ లో  జరిగే ట్వంటీ20 వరల్డ్ కప్ కు ఫేవరెట్ గా బరిలోకి దిగాలంటే మాత్రం కచ్చితంగా ఆసీస్ ను టీమిండియా ఘోరంగా ఓడాల్సి ఉంది.  మరోపక్క వన్డే సిరీస్ లో  టీమిండియా 1-4 తేడాతో ఓటమి పాలుకావడంతో టీమిండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు చోటు చేసుకున్నాయి. ఈ సిరీస్ లో విజయం ద్వారా  వాటికి సమాధానం చెప్పాలని  ధోని అండ్ గ్యాంగ్ యోచిస్తోంది.

మరోపక్క ఆసీస్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏ ఫార్మెట్ లోనైనా వెనుకబడిన ప్రతీసారి మళ్లీ అంతే స్థాయిలో పుంజుకోవడం ఆస్ట్రేలియాకు పరిపాటి. ఇప్పటికే భారత్ ను కట్టడి చేసేందుకు కెప్టెన్ ఆరోన్ ఫించ్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు తీవ్రంగా కసరత్తులు చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో ఇరు జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు తప్పకపోవచ్చు.


అదే జట్టుతో టీమిండియా!

తొలి ట్వంటీలో గెలిచిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది. వెటరన్ ఆశిష్ నెహ్రాతో సహా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, బూమ్రాలు కూడా రాణించడంతో రెండో మ్యాచ్ లో మార్పు అనేది ఉండకపోవచ్చు. ఇంకా స్టార్ ఆటగాడు అజింక్యా రహానే  గాయం నుంచి ఇంకా కోలుకోపోవడం టీమిండియాను కొద్దిగా కలవరపెడుతోంది. అయితే పాండ్యా, బూమ్రాలు బౌలింగ్ లో తమదైన ముద్ర వేయడం టీమిండియా  ధైర్యంగానే రెండో పోరుకు సన్నద్ధమవుతుందని చెప్పొచ్చు.


వాతావరణం

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే రెండో ట్వంటీకి వర్షం కురిసే అవకాశాలు కనబడుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానుంది. దీంతో ఏదొక దశలో వర్షం మ్యాచ్ కు అంతరాయం కల్గించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement