టీమిండియాదే పైచేయి కానీ.. | india lead by 132 | Sakshi
Sakshi News home page

టీమిండియాదే పైచేయి కానీ..

Aug 30 2015 5:07 PM | Updated on Sep 3 2017 8:25 AM

టీమిండియాదే పైచేయి కానీ..

టీమిండియాదే పైచేయి కానీ..

శ్రీలంకతో మూడో టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది కానీ.. రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది.

శ్రీలంకతో మూడో టెస్ట్లో టీమిండియా పైచేయి సాధించింది కానీ.. రెండో ఇన్నింగ్స్లో మూడు కీలక వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది. మ్యాచ్ మూడో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి 21/3 స్కోరు చేసింది. అంతకుముందు భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్ లో లంకను 201 పరుగులకు కుప్పకూల్చింది. టీమిండియా ఓవరాల్గా ప్రస్తుతం 132 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డ్ అవ్వగా,  మరో ఓపెనర్ రాహుల్ రెండు పరుగులు చేశాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రహానే(4)  సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. కెప్టెన్ కొహ్లీ, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు.

అంతకుముందు టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ చెలరేగటంతో శ్రీలంక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఓపెనర్లు ఉపుల్ తరంగ, సిల్వతో పాటు కరుణరత్నే, కెప్టెన్ మాథ్యూస్, తిరిమన్నేలు స్వల్ప స్కోర్లకే వెనుదిరగటంతో ఓ దశలో 127 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన లంక ఇబ్బంది పడింది. అయితే పెరీరా (55) హాఫ్ సెంచరీతో పాటు హెరాత్(49) రాణించారు.  టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మ  ఐదు వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ చెరో రెండు వికెట్లు తీశారు. ఉమేశ్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement