టీమిండియా దూకుడు | india gets 55 runs after five overs | Sakshi
Sakshi News home page

టీమిండియా దూకుడు

Feb 12 2016 7:52 PM | Updated on Nov 9 2018 6:43 PM

టీమిండియా దూకుడు - Sakshi

టీమిండియా దూకుడు

మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది.

రాంచీ:మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్లో భారత్ ఐదు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ(18), శిఖర్ ధావన్(37)లు క్రీజ్లో ఉన్నారు. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలిస్తోంది. శిఖర్ ధావన్ 17 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 37 పరుగులు చేయగా,  రోహిత్ శర్మ 14 బంతుల్లో రెండు ఫోర్లు సాయంతో 19 పరుగులు చేసి ఆచితూచి ఆడుతున్నాడు.

 

గత మ్యాచ్ లో శ్రీలంకపై ఓటమి పాలైన ధోని సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు లంకేయులు మొదటి మ్యాచ్ ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో పోరుకు సన్నద్దమయ్యారు. ఇదే జోరులో మళ్లీ భారత్ ను కంగు తినిపించాలని వారు పట్టుదలగా ఉన్నారు. లంక సీనియర్ ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ రెండో టి20కి అందుబాటులోకి రాగా,టీమిండియా జట్టులో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement