ఫైనల్ దిశగా ఇండియా బ్లూ | India Blue to the final | Sakshi
Sakshi News home page

ఫైనల్ దిశగా ఇండియా బ్లూ

Sep 7 2016 1:45 AM | Updated on Sep 4 2017 12:26 PM

దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టు ఫైనల్‌కు చేరువరుుంది. గ్రీన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట

గ్రేటర్ నోరుుడా: దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టు ఫైనల్‌కు చేరువరుుంది. గ్రీన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్‌‌సలో బ్లూ జట్టు 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది.

అంతకు ముందు గ్రీన్ జట్టు తొలి ఇన్నింగ్‌‌సలో 61 ఓవర్లలో 237 పరుగులకే ఆలౌట్ కావడంతో... బ్లూ జట్టుకు 470 పరుగుల భారీ తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం లభించింది. బ్లూ జట్టు తమ తొలి ఇన్నింగ్‌‌సలో ఏకంగా 707 పరుగులు చేయడం విశేషం.  పుజారా (166), షెల్డన్ జాక్సన్ (105) సెంచరీలు సాధించారు.

Advertisement
 
Advertisement
Advertisement