ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌ ‘ఎ’ | India A won the toss and elected to field | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌ ‘ఎ’

Feb 17 2017 10:34 AM | Updated on Sep 5 2017 3:57 AM

ఆస్ట్రేలియాతో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 'ఎ' టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో ఆరంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 'ఎ' టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత్ 'ఎ' కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత ఆస్ట్రేలియాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తో ప్రాక్టీస్ మ్యాచ్ను ఆరంభించింది.

 

ఈనెల 23 నుంచి జరిగే తొలి టెస్టు కోసం ఈ ఏకైక సన్నాహక మ్యాచ్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. జట్టు కూర్పుతో పాటు భారత ఉపఖండంలోని బలమైన స్పిన్  బౌలింగ్‌లో తమ స్థాయిని పరీక్షించుకునేందుకు ఆసీస్ కు ఇది సరైన అవకాశం కాగా, మరోవైపు భారత జట్టు తమ రిజర్వ్‌ బెంచ్‌ సత్తా తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement