రెండు రన్స్ కే ఓపెనర్లు ఔట్ | india 2/2 | Sakshi
Sakshi News home page

రెండు రన్స్ కే ఓపెనర్లు ఔట్

Aug 30 2015 4:19 PM | Updated on Sep 3 2017 8:25 AM

కొలంబో టెస్ట్ లో రెండు పరుగులకే ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా

కొలంబోలో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కీలక ఆధిక్యం సాధించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప స్కోర్ కే వెనుదిరిగారు. ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో, ఓపెనర్ చతేశ్వర్  పుజారా ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. శ్రీలంక పేసర్లు ప్రదీప్, ప్రసాద్లు చెరో వికెట్ పడగొట్టారు. దీంతో రెండు పరుగులకే టీమిండియా ఓపెనర్లను కోల్పోయింది.

 అంతకు ముందు శ్రీలంక 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 111 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియ పేసర్ ఇషాంత్ శర్మకు ఐదు వికెట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement