టీమిండియా లక్ష్యం 154

IND VS BAN 2nd T20: Team India Target 154 Runs - Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో బంగ్లాదేశ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పసలేని బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్‌తో రోహిత్‌ సేన తీవ్రంగా నిరాశపరిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. టీమిండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో విఫలమవ్వడంతో పాటు.. బ్యాట్స్‌మెన్‌ లిటన్‌ దాస్‌(29), నయీమ్‌(36), సౌమ్య సర్కార్‌(30), మహ్మదుల్లా(30) రాణించడంతో బంగ్లా టీమిండియాకు మంచి లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో చహల్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. సుందర్‌, ఖలీల్‌, చాహర్‌లు తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

టాస్‌ గెలిచిన రోహిత్‌ బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అయితే బంగ్లా ఓపెనర్లు ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. ఖలీల్‌ అహ్మద్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో వరుస బౌండరీలతో బంగ్లా ఓపెనర్లు హోరెత్తించారు.  దీంతో ఐదు ఓవర్లు ముగిసే సరికి బంగ్లా వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు దాటింది. ఈ క్రమంలో పంత్‌ అత్యుత్సాహంతో లిటన్‌ దాస్‌ స్టంపౌట్‌ అయ్యే ప్రమాదం నంచి తప్పించుకున్నాడు. ఇక తొలి పది ఓవర్లలో పేలవ బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్గింగ్‌తో భారత్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. అనంతరం తేరుకున్న భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో చివరి పది ఓవర్లలో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా వచ్చినవారు వచ్చినట్టు ధాటిగా ఆడటంతో బంగ్లా మంచి స్కోర్‌ సాధించగలిగింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top