రియోలో రిటైరవుతానంటున్న చిరుత | I may get retired after rio olympics, says Usain Bolt | Sakshi
Sakshi News home page

రియోలో రిటైరవుతానంటున్న చిరుత

Aug 28 2015 4:08 PM | Updated on Sep 3 2017 8:18 AM

రియోలో రిటైరవుతానంటున్న చిరుత

రియోలో రిటైరవుతానంటున్న చిరుత

వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్ ముగిసే అవకాశం ఉందని స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు.

వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్ ముగిసే అవకాశం ఉందని స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. 2017లో లండన్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే అవకాశం 50-50 మాత్రమే అని ఈ జమైకా దిగ్గజం చెప్పాడు. బహుశా రియో డీజెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో రిటైరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాడు.

''నా స్పాన్సర్‌లు మరో ఏడాది పాటు కొనసాగాలని కోరుతున్నారు. కానీ నాకోచ్ మాత్రం వచ్చే ప్రపంచ ఛాంపియన్ షిప్ కష్టమే అంటున్నాడు.. అందువల్ల రియో ఒలింపిక్స్ తర్వాత నా శరీరం పూర్తిగా సహకరిస్తేనే లండన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనే అవకాశం ఉంది'' అంటూ బోల్ట్ వ్యాఖ్యానించాడు. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా రియో ఒలింపిక్స్ మీదే ఉందన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ స్పందించాడు.

అంతకు ముందు, బీజింగ్‌లో ప్రపంచ స్ప్రింట్ డబుల్ గెలిచిన తర్వాత..  విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బోల్ట్‌ను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక టీవీ కెమెరామెన్ స్కూటర్ తగిలి పడిపోయిన బోల్ట్ నవ్వుతూ.. 'నా కాళ్లకు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది' అంటూ వ్యాఖ్యానిచాడు. ఇక బోల్ట్‌ను స్కూటర్ ఢీకొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫుటేజ్‌పై టీవీ కెమెరా మ్యాన్ మాత్రమే బోల్ట్‌ను పడగొట్టగలడని చైనీస్ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement