మళ్లీ ఓడిన టైటాన్స్‌ | Haryana Steelers Register Strong Win Over Telugu Titans | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన టైటాన్స్‌

Oct 5 2019 3:46 AM | Updated on Oct 5 2019 3:46 AM

Haryana Steelers Register Strong Win Over Telugu Titans - Sakshi

పంచకుల: పేలవ ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు దూరమైన తెలుగు టైటాన్స్‌... చివరి దశ మ్యాచ్‌ల్లోనైనా సత్తా చాటుతుందని అనుకుంటే దారుణమైన ఆటతీరుతో నిరాశ పరుస్తోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్‌ 32–52తో హరియాణా స్టీలర్స్‌ చేతిలో ఓడింది. రైడర్‌ సిద్దార్థ్‌ దేశాయ్‌ (12 పాయింట్లు), ఆల్‌ రౌండర్‌ ఫర్హాద్‌ (10 పాయింట్లు) పోరాటం... సమష్టిగా రాణించిన హరియాణా ముందు నిలబడలేదు. వికాస్‌ 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 41–34తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దీపక్‌ (16 పాయింట్లు) సత్తా చాటడంతో జైపూర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు ఇప్పటికే ఐదు జట్లు ఢిల్లీ, బెంగాల్, హరియాణా, ముంబై, బెంగళూరు అర్హత సాధించగా... చివరిదైన ఆరో బెర్త్‌ కోసం జైపూర్, యూపీ పోటీ పడుతున్నాయి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement