మార్పు చూసి భయపడకండి: హార్దిక్ పాండ్యా

Hardik Pandyas Radical Makeover - Sakshi

కొత్త లుక్ లోదర్శనిమిచ్చిన ఆల్ రౌండర్

న్యూఢిల్లీ:తన ఆట తీరుతో మైదానంలో ఆకట్టుకునే టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తాజాగా సరికొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కు  దూరమైన హార్దిక్.. తనకు దొరికిన విశ్రాంతిని ఆస్వాదిస్తూ వార్తల్లో నిలిచేందుకు యత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే న్యూ లుక్ తో ఫొటోలకు ఫోజులిచ్చాడు.

'మార్పు చూసి భయపడకండి.. ఇదొక కొత్త ఆరంభాలకు తీసుకెళుతుంది. మీరు ఎప్పుడూ కాంతివంతంగా ఉండేలా చూసుకోండి'అంటూ తన కొత్త లుక్ కు తనదైనన స్టైల్ లో క్యాప్షన్ ఇస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనికి మిశ్రమ స్పందన లభించింది. ఈ స్టైల్ ను కొంతమంది బాగుందంటూ రీట్వీట్లు చేస్తే.. మరికొందరు మేల్ వెర్షన్ ఆఫ్ లేడీ గాగాలా ఉన్నాంటూ సెటైర్లు విసిరారు. కాకపోతే మహిళా అభిమానులు మాత్రం క్రేజీ లుక్ తో చంపేశావ్ అంటూ హార్దిక్ స్టైల్ ను కొనియాడారు.

Back to Top