టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ | England won the toss and elected to bat | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

Nov 9 2016 10:31 AM | Updated on Sep 4 2017 7:39 PM

రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకొంది.

రాజ్‌కోట్‌: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేడు రాజ్‌కోట్ వేదికగా తొలిమ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకొంది. భారత్ ముగ్గురు స్పిన్నర్‌లు, ఇద్దరు సీమర్ల(ఉమేష్ యాదవ్, షమి)తో బరిలోకి దిగింది. ఇషాంత్ శర్మకు తుది జట్టులో స్థానం దక్కలేదు.

మ్యాచ్ ప్రారంభంలోనే ఇంగ్లండ్ ఓపెనర్ కుక్‌ అందించిన క్యాచ్‌ను భారత ఆటగాళ్లు రెండు సార్లు జారవిడిచారు. తొలి ఓవర్‌లో షమి బౌలింగ్‌లో కుక్ ఇచ్చిన క్యాచ్‌ను రహానే వదిలేయగా.. రెండో ఓవర్‌లో ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో కోహ్లీ మరో క్యాచ్ జారవిడిచాడు. ఇంగ్లండ్ 12 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 42 పరుగులతో ఆడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement