కొత్త రికార్డు; 4 ఓవర్లు, 3 మెయిడిన్లు | Deepti Sharma Creates History in T20Is | Sakshi
Sakshi News home page

కొత్త రికార్డు; 4 ఓవర్లు, 3 మెయిడిన్లు

Sep 25 2019 8:57 PM | Updated on Sep 26 2019 2:07 PM

Deepti Sharma Creates History in T20Is - Sakshi

నాలుగు ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది.

సూరత్‌: భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ టి20ల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు మెయిడిన్‌ ఓవర్లు వేసి రికార్డులకు ఎక్కింది. టి20ల్లో మూడు మూడు మెయిడిన్‌ ఓవర్లు వేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా ఖ్యాతి దక్కించుకుంది. నాలుగు ఓవర్లు వేసి కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించింది. తాను వేసిన 19 బంతికి మొదటి పరుగు ఇచ్చిదంటే ఆమె బౌలింగ్‌ ఎంత పదునుగా ఉందో తెలుస్తోంది. ఈ ఆగ్రా అమ్మాయి రెండు మేడిన్‌ ఓవర్లలో రెండు వికెట్లు తీయడం విశేషం.

దీప్తి అద్భుత ప్రదర్శనకు తోడు ఇతర బౌలర్లు కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా జట్టుతో ప్రారంభమైన టి20 సిరీస్‌లో భారత మహిళల టీమ్‌ శుభారంభం చేసింది. తమ బౌలర్లు గొప్పగా రాణించడం​ వల్లే విజయం దక్కిందని కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. తమ వ్యూహానికి తగినట్టుగా బౌలింగ్‌ చేసి విజయాన్ని అందించారని ప్రశంసించింది. (చదవండి: దీప్తి సూపర్‌ బౌలింగ్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement