352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్ | Day 4: India lost sixth wicket at 352 runs on fourth day | Sakshi
Sakshi News home page

352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన భారత్

Jan 9 2015 5:33 AM | Updated on Sep 2 2017 7:27 PM

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు భారత్ 352 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. భారత్ కెప్టెన్ వీరాట్ క్లోహీ 119.3 ఓవర్లో ఆరో వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. 230 బంతుల్లో 20 ఫోర్లు బాదిన కోహ్లీ 147 పరుగులు చేసి హారీస్ బౌలింగ్లో రోజర్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. భారత్ 122.6 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 359 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం సాహా(17), అశ్వీన్ (4) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అయితే మూడో రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా  ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది.

టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ పరుగుల వర్షం కురిపించాడు. మూడో రోజు ఆటలో భాగంగా 162 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 17 ఫోర్ల సాయంతో సెంచరీ నమోదు చేశాడు.  దీంతో నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు అడిలైడ్ లో రెండు సెంచరీలు, మెల్ బోర్న్ లో ఒక సెంచరీతో విరాట్ ఆకట్టుకున్నాడు.  ఓవరాల్ గా విరాట్ కు టెస్టు మ్యాచ్ ల్లో 10 వ సెంచరీ.  ఆసీస్ బౌలర్లలో లయోన్, హరీస్ తలో వికెట్ తీసుకోగా, స్టార్క్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement