రెండు డే నైట్‌ టెస్టులు ఆడండి!

Cricket Australia To Request For More Than One Day And Night Test Against India  - Sakshi

భారత్‌ను కోరనున్న ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌/కోల్‌కతా: వచ్చే ఏడాది చివర్లో తమ దేశంలో పర్యటించనున్న భారత జట్టు నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టులను డే నైట్‌లో ఆడాలని క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) కోరుకుంటోంది. వచ్చే జనవరిలో భారత్‌లో వన్డే సిరీస్‌ ఆడేందుకు ఆస్ట్రేలియా రానున్న సందర్భంగా ఈ విషయంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో చర్చించాలని సీఏ చైర్మన్‌ ఎర్ల్‌ ఎడింగ్స్‌ భావిస్తున్నారు. అయితే ఆ్రస్టేలియా ప్రతిపాదనపట్ల బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడంలేదు. ‘అధికారికంగా క్రికెట్‌ ఆ్రస్టేలియా నుంచి నాకు ఎలాంటి సమాచారం అందలేదు. అయినా ఒకే సిరీస్‌లో రెండు డే నైట్‌ టెస్టులంటే ఎక్కువే. సిరీస్‌లో ఒక డే నైట్‌ మ్యాచ్‌ ఉంటే చాలు’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆ్రస్టేలియా పర్యటనకు వెళ్లనున్న భారత్‌ నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top