సచిన్ చివరి మ్యాచ్: క్రిస్ గేల్ ఔట్.. షమీకి తొలి వికెట్ | Chris gayle out for 11 runs in Sachin tendulkar's last match | Sakshi
Sakshi News home page

సచిన్ చివరి మ్యాచ్: క్రిస్ గేల్ ఔట్.. షమీకి తొలి వికెట్

Nov 14 2013 11:01 AM | Updated on Sep 2 2017 12:36 AM

ఐపీఎల్ మ్యాచ్లలో సిక్సర్లు అలవోకగా బాదేస్తూ.. అందరినీ హడలెత్తించిన క్రిస్ గేల్ కాస్తా 11 పరుగులకే చాప చుట్టేశాడు.

ఐపీఎల్ మ్యాచ్లలో సిక్సర్లు అలవోకగా బాదేస్తూ.. అందరినీ హడలెత్తించిన క్రిస్ గేల్ కాస్తా 11 పరుగులకే చాప చుట్టేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చిట్టచివరి మ్యాచ్లో క్రిస్ గేల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇంతకుముందు మ్యాచ్లో 9 వికెట్లు తీసి దడదడలాడించిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మన్ను సులభంగా బోల్తా కొట్టించాడు. దీంతో జట్టు స్కోరు 25 పరుగుల వద్ద ఉండగానే రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా క్రిస్ గేల్ వెనుదిరిగాడు. 17 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ కొట్టిన గేల్ తక్కువ స్కోరు వద్దే ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అంతకుముందు ఈ మ్యాచ్లో బారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుటుంబం మొత్తం వాంఖడే స్టేడియానికి చేరుకుంది.

తర్వాత 20 ఓవర్లు ముగిసేసరికి వెస్టిండీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 64 పరుగుల స్కోరు చేసింది. పావెల్ 23 పరుగులతోను, డారెన్ బ్రేవో 19 పరుగులతోను క్రీజ్ను అంటిపెట్టుకుని ఉన్నారు. సచిన్ చివరి మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది. సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో ఇన్ని మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా సచిన్ రికార్డు బద్దలు కొట్టాడు. అలాగే క్రికెట్ సచిన్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement