‘చైనా మాస్టర్స్’కు సైనా, సింధు దూరం | 'China Masters' to Saina NEhwal ,P.V sindhu not playing the game | Sakshi
Sakshi News home page

‘చైనా మాస్టర్స్’కు సైనా, సింధు దూరం

Aug 28 2013 1:56 AM | Updated on Sep 1 2017 10:10 PM

వచ్చేనెలలో జరిగే చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు వైదొలిగారు.

న్యూఢిల్లీ: వచ్చేనెలలో జరిగే చైనా మాస్టర్స్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ నుంచి భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధు వైదొలిగారు. అయితే సెప్టెంబరు 17 నుంచి 22 వరకు జరిగే జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఈ ఇద్దరూ బరిలోకి దిగుతారు.
 
 ‘చైనా మాస్టర్స్ టోర్నీకి సైనా, సింధు దూరంగా ఉంటారని ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందుగానే చీఫ్ కోచ్ గోపీచంద్ నిర్ణయించారు. ఐబీఎల్ ముగిశాక హైదరాబాద్‌లో జరిగే జాతీయ శిక్షణ శిబిరంలో వీరిద్దరు పాల్గొంటారు’ అని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ఉపాధ్యక్షుడు టీపీఎస్ పురి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement