బుమ్రా ‘బోణీ’ చేశాడు..! | Bumrah rattles South Africa | Sakshi
Sakshi News home page

బుమ్రా ‘బోణీ’ చేశాడు..!

Jun 5 2019 3:34 PM | Updated on Jun 5 2019 3:47 PM

Bumrah rattles South Africa - Sakshi

సౌతాంప్టాన్‌: తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బోణీ కొట్టాడు. వరల్డ్‌కప్‌లో మొదటి వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్‌లో బుమ్రా శుభారంభం అందించాడు. సఫారీ ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా వికెట్‌ను సాధించాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా నాల్గో ఓవర్‌ రెండో బంతిని బుమ్రా ఆఫ్‌ స్టంప్‌పై గుడ్‌ లెంగ్త్‌లో సంధించాడు. దానికి తడబడిన ఆమ్లా.. రోహిత్‌కు స్లిప్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

కాస్త తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను సెకండ్‌ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మ అద్భుతంగా పట్టుకున్నాడు. దాంతో ఆమ్లా ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌ చేరాడు. ఆపై డీకాక్‌(10)ను సైతం బుమ్రా ఔట్‌ చేశాడు. ఆరో ఓవర్‌ ఐదో బంతికి డీకాక్‌ స్లిప్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ను థర్డ్‌ స్లిప్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి అందుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా 24 పరుగుల వద్ద ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌ సాధించిన తొలి రెండు వికెట్లు బుమ్రా ఖాతాలో పడటం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement