సాక్షి పసిడి పంచ్‌  | Boxing: Sakshi Choudhary clinches world youth crown with clinical win | Sakshi
Sakshi News home page

సాక్షి పసిడి పంచ్‌ 

Sep 1 2018 1:01 AM | Updated on Sep 1 2018 1:01 AM

 Boxing: Sakshi Choudhary clinches world youth crown with clinical win

బుడాపెస్ట్‌: ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో సాక్షి (57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్‌ (క్రొయేషియా)పై  సాక్షి విజయం సాధించింది. మనీష (64 కేజీలు), అనామిక (51 కేజీలు) ఫైనల్స్‌లో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు.

డెస్టినీ గార్సియా (అమెరికా) చేతిలో అనామిక; గెమ్మా (ఇంగ్లండ్‌) చేతిలో మనీష ఓటమి పాలయ్యారు. ఓవరాల్‌గా ఈ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు 2 స్వర్ణాలు, 2 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తం 10 పతకాలు సాధించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement