స్టోక్స్‌కు న్యూజిలాండ్‌ అత్యున్నత పురస్కారం?

Ben Stokes, Kane Williamson Nominated For New Zealander Of The Year Award - Sakshi

వెల్లింగ్‌టన్‌ : ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన ఇంగ్లండ్‌  ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ న్యూజిలాండర్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు నామినేట్‌ అయ్యాడు. స్టోక్స్‌తో పాటు కివీస్‌  కెప్టెన్‌  కేన్‌ విలియమ్సన్‌ కూడా నామినేట్‌ అవడం విశేషం. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం మొత్తం ప‌ది మందిని ఫైన‌ల్ లిస్టుకు నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు. ఆ అవార్డును 2020 ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేస్తారు. 

ఇక ఈ అవార్డుకు నామినేట్‌ చేసిన చీఫ్‌ జడ్జి కామెరున్‌ బెన్నెట్‌ స్పందించాడు. స్టోక్స్‌ న్యూజిలాండ్‌  తరపున ఆడకపోయినా అతని తల్లిదండ్రులు ఇక్కడి వారవడంతో ఈ అవార్డ్‌కు నామినేట్‌ చేశామని తెలిపాడు. అలాగే ఈ ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న  కేన్‌ విలియమ్సన్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. ఒంటిచేత్తో న్యూజిలాండ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన విలియమ్సన్‌ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనా, అతని తెగువ, ధైర్యమే ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యేలా చేసిందన్నాడు.

స్టోక్స్‌ పుట్టింది కివీస్‌లోనే అయినా, తన 12 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. స్టోక్స్‌ తండ్రి గెరార్డ్‌ న్యూజిలాండ్‌ తరపున రగ్బీ లీగ్‌ ఆడేవాడు. కొంతకాలం  ఇంగ్లండ్‌లో రగ్బీ కోచ్‌గా పనిచేసిన గెరార్డ్‌ కుటుంబంతో సహా తిరిగి స్వదేశానికి తిరిగివచ్చినా, స్టోక్స్‌ మాత్రం ఇంగ్లండ్‌లోనే ఉండిపోయాడు. ఇక ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టైగా నిలవడంలో స్టోక్స్‌ చేసిన 84 పరుగులను ఎప్పటికీ మరచిపోలేనిది. ఈ నేపథ్యంలో సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితం తేలకపోవడంతో ఇన్నింగ్స్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ జట్టు జగజ్జేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top