టీమిండియా లక్ష్యం 121 | bangladesh set target of 121 runs against india | Sakshi
Sakshi News home page

టీమిండియా లక్ష్యం 121

Mar 6 2016 10:16 PM | Updated on Sep 3 2017 7:09 PM

ఆసియాకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో బంగ్లాదేశ్ 121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో బంగ్లాదేశ్  121 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బంగ్లాదేశ్ బ్యాటింగ్ చేయాల్సిదింగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్కు ఓపెనర్లు తమీమ్ ఇక్బాల్(13), సౌమ్య సర్కార్(14)లు నిరాశపరచగా, షకిబుల్ హసన్(21) మోస్తరుగా రాణించాడు. షకిబుల్ మూడో వికెట్ గా పెవిలియన్కు చేరే సరికి బంగ్లాదేశ్ స్కోరు 64 పరుగులు.

అటు తరువాత బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో ముష్ఫికర్ రహీమ్(4), మోర్తజా(0) వికెట్లను నష్టపోయింది. కాగా, ఆ తరుణంలో షబ్బిర్ రెహ్మాన్(32 నాటౌట్) , మహ్మదుల్లా(33 నాటౌట్)లు దూకుడుగా ఆడారు. ఈ జోడి ప్రత్యేకంగా హార్దిక్ పాండ్యా వేసిన 14. 0 ఓవర్లో 21 పరుగులను పిండుకోవడంతో బంగ్లాదేశ్ స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. అయితే చివరి ఓవర్లో బూమ్రా ఏడు పరుగులను మాత్రమే ఇవ్వడంతో బంగ్లాదేశ్ 15.0 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. భారత బౌలర్లలో  ఆశిష్ నెహ్రా, అశ్విన్, బూమ్రా, రవీంద్ర జడేజాలకు తలో వికెట్ దక్కింది.


అంతకుముందు వరుణుడు అంతరాయం కల్గించడంతో మ్యాచ్ను అనుకున్న సమయానికి నిర్వహించడం సాధ్యపడలేదు. కాగా, రాత్రి గం.8.30ని.లకు పిచ్ను, అవుట్ ఫీల్డ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ను 15.0 ఓవర్లపాటు జరిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement