మెయిన్‌ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట | Balaji-Vardhan in Wimbledon main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు విష్ణు–బాలాజీ జంట

Jun 28 2018 4:35 AM | Updated on Jun 28 2018 4:35 AM

Balaji-Vardhan in Wimbledon main draw - Sakshi

విష్ణువర్ధన్, శ్రీరామ్‌ బాలాజీ

లండన్‌: కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆడేందుకు హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ విష్ణువర్ధన్, చెన్నైకు చెందిన శ్రీరామ్‌ బాలాజీ సిద్ధమయ్యారు. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో విష్ణువర్ధన్‌–శ్రీరామ్‌ బాలాజీ ద్వయం పురుషుల డబుల్స్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది. బుధవారం జరిగిన డబుల్స్‌ క్వాలిఫయింగ్‌ ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లో విష్ణు–బాలాజీ జోడీ 6–3, 6–4తో టాప్‌ సీడ్‌ డెనిస్‌ మొల్చనోవ్‌ (ఉక్రెయిన్‌)–ఇగోర్‌ జెలెనె (స్లొవేనియా) జంటపై విజయం సాధించింది. 

మరో మ్యాచ్‌లో జీవన్‌ నెడున్‌చెజియాన్‌ (భారత్‌)–ఆస్టిన్‌ క్రాయిసెక్‌ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–3తో ఎడ్వర్డ్‌ కోరి–లాయిడ్‌ గ్లాస్‌పూల్‌ (బ్రిటన్‌) జంటను ఓడించి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందింది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనాకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్‌ రెండో రౌండ్‌లో అంకిత 2–6, 7–5, 4–6తో వితాలియా దియాత్‌చెంకో (రష్యా) చేతిలో పోరాడి ఓడింది. వింబుల్డన్‌ ప్రధాన టోర్నమెంట్‌ జూలై 2న ప్రారంభమవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement