తిరుగులేని ఆస్ట్రేలియా | Australia Won The T20 Series Against Pakistan | Sakshi
Sakshi News home page

తిరుగులేని ఆస్ట్రేలియా

Nov 9 2019 4:53 AM | Updated on Nov 9 2019 4:53 AM

Australia Won The T20 Series Against Pakistan - Sakshi

పెర్త్‌: సొంతగడ్డపై ఈ సీజన్‌లో అద్భుత ఆటను ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా మరోసారి పాకిస్తాన్‌పై తమ ఆధిపత్యాన్ని చూపించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి టి20లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ముందుగా పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులే చేయగలిగింది. ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (37 బంతుల్లో 45; 6 ఫోర్లు) ఒక్కడే కాస్త ఆదుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత జాతీయ జట్టు తరఫున ఆడిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌’ సీన్‌ అబాట్‌ (2/14), కేన్‌ రిచర్డ్సన్‌ (3/18) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం ఆసీస్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్‌ నష్టపోకుండా 11.5 ఓవర్లలో 109 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (36 బంతుల్లో 52 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), వార్నర్‌ (35 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి 49 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. మూడు మ్యాచ్‌ల పోరులో తొలి టి20 వర్షంతో రద్దు కాగా... ఆసీస్‌ 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement