
డర్బన్: నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 118 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.417 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన సఫారీ జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 298 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ శుభారంభం చేసింది.
293/9 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా మరో ఐదు పరుగులు జత చేసి ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. దాంతో ఆసీస్ ఘన విజయం సాధించింది. చివరి వికెట్‌గా డీకాక్(83)అవుట్ కావడంతో సఫారీ ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ నాలుగు వికెట్లు సాధించగా, హజల్‌వుడ్ మూడు వికెట్లు తీశాడు. కమిన్స్, మిచెల్ మార్ష్‌లకు తలో వికెట్ దక్కింది.
ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 351 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 227 ఆలౌట్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 162 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 298 ఆలౌట్