ఉత్కంఠగా భారత్, ఆసీస్ పోరు | australia 248/6 | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా భారత్, ఆసీస్ పోరు

Jan 18 2015 4:32 PM | Updated on Sep 2 2017 7:52 PM

భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉత్కంఠగా మారింది.

మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆసీస్ విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో భారత్ చివర్లో వికెట్ పడగొట్టి ఒత్తిడి పెంచింది. కెప్టెన్ బెయిలీని అశ్విన్ అవుట్ చేయగా, ఆ వెంటనే మ్యాక్స్వెల్ను భువనేశ్వర్ పెవిలియన్ బాటపట్టించాడు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 47 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.

అంతకుముందు ఆసీస్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (97) సెంచరీ, స్మిత్ (47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు. షమీ.. స్మిత్ను, ఉమేష్ యాదవ్.. ఫించ్ను అవుట్ చేశారు. స్మిత్.. అశ్విన్కు, ఫించ్.. ధోనీకి దొరికిపోయారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్..  ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement