'మా జట్టులో గందరగోళ పరిస్థితులు'

Aussies in 'confusion' ahead of Ashes says,Warne - Sakshi

సిడ్నీ:త్వరలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సెలక్షన్ పై ఆ దేశ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కు ఆసీస్ సెలక్షన్ చూస్తుంటే తమ జట్టు గందరగోళ పరిస్థితికి అద్దం పడుతుందంటూ వార్నీ చురకలంటించాడు. ప్రధానంగా ఏడేళ్ల తరువాత వికెట్ కీపర్ టిమ్ పైనీ ఎంపికను వార్న్ ఈ సందర్భంగా తప్పుబట్టాడు.

'మా సెలక్టర్ల డైరెక్షన్ ఎలా ఉందో జట్టు సెలక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఆసీస్ గందరగోళ పరిస్థితికి ఇదొక ఉదాహరణ. మా సెలక్టర్లు వికెట్ కీపర్ల ఎంపికపైనే దృష్టి పెట్టినట్లు ఉంది. ఎప్పుడో ఏడేళ్ల క్రితం చివరిసారి జట్టులో కనిపించిన వారికి మళ్లీ అవకాశం ఇచ్చారు. అది కూడా ఆసీస్ జట్టులో స్పెషలిస్టు వికెట్ కీపర్లుండగా మరొక కీపర్ పైనీ ఎంపిక చేయడం ఎంతవరకూ కరెక్ట్. ఆసీస్ జట్టు అంటే ఇంగ్లండ్ కు ఎప్పుడ్నుంచో భయం పోయింది. అదే మాపై ఇంగ్లండ్ పైచేయి సాధించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు చూస్తే మా జట్టు కంటే ఎన్నిరెట్లు బాగుంది.  ఇంగ్లండ్ జట్టులో బెన్ స్టోక్స్ లేకపోయినా ఆసీస్ జట్టును చూసి వారు భయపడతారని అనుకోవడం లేదు'అని వార్న్ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top